రుణ మాఫీ చేయలేదు… చేయలేదు… ఇదీ బీఆర్ఎస్, బీజేపీ వాదన. మాఫీ చేశాం.. చేశాం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి రోజూ ఇవే సేమ్ టు సేమ్ డైలాగ్స్. మ్యాటర్ ఎటూ తెగడం లేదు. మాఫీ జరిగిందని ఒకరు… కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగెటివ్ ప్రచారాలకు విపక్షాలు తెర లేపితే.. పాజిటివిటీ యాంగిల్ లో ప్రభుత్వం దూసుకెళ్తుంది. మరి రుణ మాఫీ జరిగింది నిజమా? అబద్ధమా..?తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆవేశంగా మాట్లాడారు.. తెలంగాణలో రైతు రుణమాఫీపై స్పందించారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా చేయలేదని… చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారన్నది ప్రధాని మాట. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి వెళ్లిన మోడీ.. తెలంగాణలో రైతు రుణమాఫీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది.. కానీ ఒక్కటీ నెరవేర్చదు అన్నది ప్రధాని వాదన. ఈ వాదన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది.
కాంగ్రెస్ నేతలు స్పందింస్తూ తాము రుణమాఫీ చేశామని చెప్పకొస్తున్నారు. తమది అబద్ధపు ప్రచారం కాదని.. తమపై ఉద్దేశ్య పూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు.ప్రధాని మాటలతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రైతు రుణమాఫీ గురించి వాస్తవాలేంటో ఏకంగా ప్రధాని మోడీకే వివరాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే… రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని చెప్పుకొచ్చారు. కేవలం 27 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కింద రూ. 17,869 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 18న లక్ష రూపాయల్లోపు రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు రూ.6,034 కోట్లు… అదే నెల 30వ తేదీన లక్షన్నర లోపు రుణాలు ఉన్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు రూ.6,190 కోట్లు… ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు రూ. 5,644 కోట్లను బదిలీ చేశామని వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద పంట రుణమాఫీ అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. ప్రధాని మోడీ ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఈ లెక్కలన్నీ ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉన్న లెక్కలేనని… బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ. 26 వేల కోట్లను కేటాయించిందని… అర్హత ఉన్న ప్రతీ రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు 31 వేల కోట్లు కేటాయించేందుకు సిద్ధమైందంటున్నారు. అంతే కాదు.. రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శకత్వం కావాలన్నారు. సో ఇక్కడికి ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు సీఎం రేవంత్