గాంధీ భవన్ లో బుదవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రొహిన్ రెడ్డి ,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కార్పోరేషన్ చైర్మన్లు శివసేన రెడ్డి,నూతి శ్రీకాంత్ గౌడ్,జేరిపటి జైపాల్ వివిధ అనుబంధ సంఘాల నేతలు..పాల్గొన్నారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రి గా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తల సమస్యల పై విజ్ఞాపనలు వినడానికి ఇక్కడికి రావడం జరిగింది.. కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు..ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది ఇందిరమ్మ ఇళ్లు త్వరగా ప్రారంభించాలని ప్రజల నుండి విజ్ఞాపనలు అందాయిరేషన్ కార్డులు డిజిటల్ పైలెట్ ప్రాజెక్ట్ జరుగుతుంది..ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు..చాలా మంది కార్యకర్తలను కలిసే అవకాశం ఈ వేదిక మీద దొరికింది..ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ పరంగా పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తల సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినామని తెలిపారు.
వారికి అండగా ఉంటాం..
తెలంగాణ ప్రభుత్వం నియంతళ్లా మేము చెప్పిందే వినాలని కాకుండా అందరి దగ్గర నుండి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం.. గల్ఫ్ బాధితులను ప్రజావాణి ఏర్పాటు చేశాం ..చనిపోతే 5 లక్షల ఎక్స్ గ్రషియా ఇస్తున్నాం..విద్యా ,వైద్యం ,ఉపాది అవకాశాలు అన్నిరంగాల్లో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది..10 నెలలు కూడా కానీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తున్నారు.వరద సహాయక చర్యలు చేపట్టి ఆర్థిక సహాయం చేయాలని కోరిన 400 కోట్లు మాత్రం కేటాయించింది..బీజేపీ బిఆర్ఎస్ తానా తందాన అన్నవిధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు..కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుంది.ప్రజలందరూ పార్టీకి బుద్ధి చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు..అయినా బుద్ధి రా బిఆర్ఎస్ లేదు..హైదరాబాద్ గాంధీ భవన్ మాత్రమే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు మంత్రులు కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుతున్నపరిపాలన కు సంబంధించి ఫామ్ హౌస్ నుండి కాకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి ప్రజా పాలన అందిస్తున్నాం..మంత్రులు అధికారులు వారి డిపార్ట్మెంట్ల వారిగా స్వేచ్ఛగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు..తెలంగాణ ప్రగతి మీద రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం పై ముందుకు పోతున్నాం.బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే మీ సూచనలు సలహాలు ఇవ్వండీ మీ అసత్య ప్రచారాలు నమ్మరన్నారు.