అంతర్జాతీయం రాజకీయం

మోడీతో జర్మన్ చాన్సలర్ భేటీ

భారత ప్రధాని నరేంద్రమోదీతో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్ స్కోల్జ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించేందుకు గాను శుశ్రవారం వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం, స్వచ్ఛ ఇంధన రంగాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరపున్నట్లు తెలుస్తోంది.18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్‌లో పాల్గొనేందుకు జర్మనీ ఛాన్స్‌లర్‌ గురువారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చారు. గురువారం అర్థరాత్రి వచ్చిన ఛాన్సలర్‌ను రాష్ట్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిత్యానంద రాయ్‌ కలుసుకున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు స్కోల్జ్ అక్టోబర్ 24 నుంచి 26 వరకు భారత్‌లో అధికారికంగా పర్యటిస్తారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మెరుగైన భద్రత, రక్షణ సహకారంతో పాటు ఆర్థిక సహకారం.. స్థిరమైన అభివృద్ధి భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.

అదే విధంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన 18వ ఆసియా పసిఫిక్‌ కాన్ఫరెన్స్ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్మనీతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యాపారులు, అధికారులు, రాజకీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. అనంతరం జర్మీ ఛాన్స్‌లర్‌ గోవాకు వెళ్లనున్నారు. భారత్‌, జర్మనీలు 2000 నుంచి వ్యూహాత్మాక భాగస్వామ్యం కలిగిఉన్నట్లు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.