ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ సభ్యత్వ కార్డే టీడీపీ కుటుంబ సభ్యులకు కొండత భరోసా

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుతో కార్యకర్తల కుటుంబాలకు కొండంత భరోసాను కల్పిస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా శనివారం
పుట్టపర్తి నియోజకవర్గం ఓడి చెరువు మండలం లో    నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ సభ్యత్వం ఉంటే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు వస్తాయని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ కార్డు ఉండి ప్రమాద శావత్తు మరణిస్తే వారికి  5 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని అన్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ,రాష్ట్రంలో  పుట్టపర్తి నియోజకవర్గాన్ని రికార్డు స్థాయిలో టీడీపీసభ్యత్వాలు చేసి అగ్రభాాగంలో నిలిపే విధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు .నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు తగ్గకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. అతి త్వరలో రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు.
త్రాగునీరు విద్యుత్ ,పారిశుధ్యం కు ప్రాధాన్యత కల్పించి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే పెద్ద పీట వేసినట్లు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం లోని 195 చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం 4 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం నియోజకవర్గానికి 20 కోట్లు నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడి వారికి అన్ని విధాలుగా ఆర్థిక సాయంగా రాజకీయంగా న్యాయం చేస్తామని తెలిపారు. ఇల్లు, పింఛన్లు, రేష్‌న్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతి బుధవారం ఒక మండలంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పిర్యాదు ల దినం నిర్వహిస్తామని తెలిపారు.