ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రికి ర‌ఘురామ ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంద‌న్న ర‌ఘురామ‌

ఉపాధిహామీ బిల్లుల బకాయిల చెల్లింపుల్లో ఏపీ స‌ర్కారు జాప్యం చేస్తుండడంపై కేంద్ర ప్ర‌భుత్వానికి వైస్సార్సీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు.

‘కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ గిరిరాజ్ సింగ్ గారిని కలిసి ఎన్ఆర్‌జీఎస్‌ బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం గురించి, బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించడం జరిగింది’ అని ర‌ఘురామ కృష్ణ‌రాజు తెలిపారు. కాగా, ఉపాధిహామీ బిల్లుల బకాయిలు విడుద‌ల చేయాలంటూ గ‌తంలోనూ సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ లేఖ రాసిన విష‌యం తెలిసిందే.