తెలంగాణ రాజకీయం

మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై ఈ నోటీసులు ఇచ్చింది. గతేడాది మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది.గతేడాది జూన్‌లో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు చేసింది. మెడికల్ సీట్లను బ్లాక్ చేసి అమ్మకున్నట్లు గుర్తించింది. సోదాలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ ప్రస్తుతం నోటీసులు ఇచ్చింది.సమయం, సందర్భం వచ్చినప్పుడు పాలు, పూలు అమ్మి పైకొచ్చానని చెబుతారు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఐటీ, ఈడీ రైడ్స్ చేసినప్పుడు ఆయన చెప్పే మాట ఇది. గతేడాది జూన్‌లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండురోజుల పాటు సోదాలు చేసింది ఈడీ.లెక్కలు చూపని కోటి 40 లక్షల నగదు సీజ్ చేసినట్టు అప్పట్లో వెల్లడించింది.

కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల 89 లక్షలు నగదు సైతం సీజ్ చేసింది. అంతేకాదు హార్డ్ డ్రైవ్, పెన్ డ్రైవ్‌లతో పాటు పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసు లోతుల్లోకి  వెళ్తే.. రెండేళ్ల కిందట అంటే సరిగ్గా 2022 ఏప్రిల్‌లో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్లాన్ ప్రకారం పీజీ సీట్లను బ్లాక్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. ఆపై సోదాలు నిర్వహించడం చకచకా జరిగిపోయింది. వాటికి సంబంధించి లేటెస్ట్‌గా ఈడీ ఎమ్మెల్యే మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో వారిని విచారించేందుకు సిద్ధమవుతోంది ఈడీ. అధికారుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.