తెలంగాణ రాజకీయం

కోర్టుకు హజరయిన నాగ్ కుటుంబం

హీరో నాగార్జున పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. ఎల్లుండి రెండో సాక్షి వెంకటేశ్వట్లు స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తామని తెలిపింది. కాగా, మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు.
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.అయితే.. ధర్మానసం ఆదేశాల మేరకు.. నాగార్జున నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాగార్జున వెంట.. ఆయన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో పాటు సుప్రియ, నాగ సుశీల, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మంత్రి కొండా సురేఖపై ఎందుకు పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది. ఈ క్రమంలో.. నాగచైతన్య, సమంతల విడాకులపై, తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ధర్మాసనానికి నాగార్జున వివరించారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వకమైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నాగార్జున తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.