ఆయన భగభగమండే భగత్‌సింగ్. తప్పు జరిగితే నిలదీసే వకీల్ సాబ్. జనం తరఫున గళమై వాయిస్ వినిపించే జనసేనాని. ఇలా సినిమాల్లో అయినా.. పాలిటిక్స్‌లో అయినా పవన్ పంథానే సెపరేటు. ఆయన ఆలోచనా విధానం అంతకన్నా వేరు. జనం మెచ్చిన నేతగా ఉండాలనేదే ఆయన అభిమతం. అందుకే పదవిలో ఉన్నా లేకపోయినా.. జనసేనానిది జనం గొంతె. ఏపీ ప్రభుత్వంలో కీలక పోస్ట్‌లో ఉన్నా..తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు పవన్. పదవి ఉంటే పెదవులు మూసుకుపోతాయి. రాజకీయాల్లో ఇదో నానుడి ఉంది. అపోజిషన్ లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతారు. పవర్ లో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై గళమెత్తే వారికే ఓ రేంజ్ ఉంటుంది. అలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ మిస్సైల్. ఆయన రూటు సెపరేటు. పంథా వేరు. ప్రణాళిక వేరు. అపోజిషన్ లో ఉన్నప్పుడే కాదు..ఇప్పుడు అధికారంలో ఉన్నా..తాను ఉన్నత పదవిలో కొనసాగుతున్నా.. తప్పు అనిపిస్తే సెకండ్ థాట్ లేకుండా పబ్లిక్ గానే చెప్పేస్తున్నారు. జనం మెచ్చిన సేనాని అయిన జనసేనాని బిగ్ వాయిస్ వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. హిందుత్వం మీద ఆయన తీసుకున్న స్టాండ్.. వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్‌పై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అవేవీ ఆయనకు అవసరం లేదు. తానేప్పుడు జనానికి సేనానిగా ఉండాలనేదే పవన్ ఆలోచన.పవన్ దూకుడు ఓ రకంగా హాట్ టాపిక్‌గా మారింది.
పిఠాపురం సభలో ఆయన చేసిన కామెంట్స్ ఏకంగా సొంత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉన్నాయనే విమర్శలు తెరమీదకు వచ్చాయి. అయితే అధికారుల తీరు నచ్చకే పవన్ అలా మాట్లాడారట. ఏదైనా ఇష్యూపై మంత్రులు ఉన్నతాధికారులకు కాల్ చేస్తే కిందిస్థాయి అధికారులకు చెప్తామంటూ లైట్ తీసుకుంటున్నారట. ఇదే పవన్‌కు ఆగ్రహం తెప్పించిందని.. అందుకే ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారంటున్నారు. కూటమిలో కుంపటి లేదు.. పవన్‌లో అసంతృప్తి లేదు..తన దృష్టికి వచ్చి ఆవేదన కలిగించిన అంశాలపైనే పవన్ మాట్లాడారని అంటున్నారు.జనసేన అధినేత వరసగా రెండు సభలలో పాత జనసేనానిని గుర్తుకు వచ్చేలా బిగ్ సౌండ్ చేశారు. తొక్కి పట్టి నార తీస్తానంటూ ఏలూరు సభలో విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇక లేటెస్ట్ గా పిఠాపురం సభలో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా పవన్ మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ గర్జించిన తీరులో చాలా మ్యాటర్ ఉందని అంటున్నారు.
తప్పు జరిగితే సొంత ప్రభుత్వం అయినా చూడను అన్న సంకేతాన్ని జనంలోకి పంపించినట్లు స్పష్టం అవుతోంది. సేమ్ టైమ్ అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని.. ప్రభుత్వ పెద్దలను, మంత్రులను అలర్ట్ చేసే ఉద్దేశం కూడా కనిపిస్తుందంటున్నారు.ఆ మధ్య శ్రీవారి లడ్డూ ఇష్యూ సమయంలో కూడా పవన్ స్టాండ్ టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని స్టేట్ మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ప్రాయశ్చిత దీక్ష చేసి..తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్లి అందరి దృష్టిని ఆకర్శించారు. ఇప్పటికీ రెగ్యులర్ గా సనాతన ధర్మం, హిందుత్వంపై స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో అటు విపక్షాన్ని.. ఇటు స్వపక్షాన్ని అందరినీ కార్నర్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా చాలా కాలానికి పవన్ లో దూకుడు చూశామని జనసైనికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా పవన్ తమ తరఫున గొంతు విప్పుతున్నారని జనం అనుకుంటున్నారు. అపోజిషన్‌కు చాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వంలోనే ప్రతిపక్షంగా ఉంటూ డ్యూయల్ రోల్ పోషించడం ద్వారా పవన్ వైసీపీకి ఝలక్ ఇచ్చారని కూడా అంటున్నారు.
ఇక జగన్ కు, షర్మిలకు మధ్య జరుగుతున్న సరస్వతి పవర్ సంస్థ భూములపై రివ్యూ చేసి కూడా సంచలనం సృష్టించారు పవన్. సరస్వతి భూముల్లో అటవీ భూములు ఉన్నాయా అనే దానిపై ఆరా తీశారు. ఇది ఓ రకంగా వైసీపీని ఇరకాటంలో పెట్టింది. ఇలా విపక్షం..స్వపక్షం అనేం లేదు. తన దృష్టికి వచ్చిన ప్రతీ అంశంపై రియాక్ట్ అవుతూ వస్తున్నారు పవన్.మరోవైపు హిందుత్వ సేనానిగా ప్రొజెక్ట్ అవుతున్న పవన్ బీజేపీ పెద్దలతోనూ సఖ్యతతో మెలుగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి సరస్వతి భూముల విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పవన్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇలా పవన్ పంథా చాలా సెపరేట్‌గా ఉంటుంది.