ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేను, గూండాలను పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి చస్తున్నావో అర్థం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏసీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇంతకంటే దిగజారుతనం మరోటి లేదని పేర్కొన్నారు. ‘నీ తాడేపల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం. నీ ఇంటికి వచ్చే రోజు కూడా ఎంతో దూరం లేకుండా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు’ అని లోకేశ్ హెచ్చరించారు.
‘జగన్ ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గర పడింది, అందుకే ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి రౌడీలను పంపుతున్నారు, అంతెందుకు నువ్వే ఓ సారి వచ్చిపోకూడదు’ అని సూచించారు. ‘మా పెద్దాయన నీలాంటి క్రూర, నేర స్వభావం ఉన్నోడు కాదు, కాదూ-కూడదు ఇలాగే బ్లేడ్ బ్యాచ్‌లను వేసుకొచ్చేస్తానంటే, నీ సరదాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కరికి వడ్డీతో సహా వడ్డిస్తాం’ అని హెచ్చరించారు.