ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సరస్వతి పవర్ కంపేని షేర్ల పై జగన్ కేసు

హైదారాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో జగన్ కేసు విచారణ జరిగింది. విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు. దాంతో ఎన్సీఎల్టీ  కేసు విచారణను   వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేసారు.  తనకు తెలియకుండా తల్లి, సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్ లో జగన్  పేర్కోన్నారు.  పిటీషన్లో విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.   షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారని  జగన్ వాదన.  జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీ పేర్ల మీద ఉన్న 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేసారు.