వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీమంత్రి హరీష్ రావు మంగళవారం నాడు దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. ఏ అంశం మీద అయినా నేను బహిరంగ చర్చకు సిద్ధం. కెసిఆర్ దయ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అంటారు. దేవుడు మీద ఒట్టు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. రైతులకు న్యాయం జరగాలని, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయాలని దేవుడిని వేడుకున్నా. అన్ని రంగాల్లో కేసీఆర్ తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిపితే రేవంత్ రెడ్డి 10 నెలల పాలనలో ఆ స్థానాన్ని కోల్పోయింది. కెసిఆర్ వందేళ్ళ ముందుకు తీసుకెళ్తే రేవంత్ రెడ్డి వందేళ్ళ వెనకకు తీసుకెళ్లాడు. కేసీఆర్ పైనా మట్లాడే అర్హత.. రేవంత్ రెడ్డి కి లేదు. రైతుబందు కింద ఎకరాన 15 వేలు వెంటనే చెల్లించాలి. దేవుడు మీద ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి భగవంతునికి క్షమాపణ చెప్పాలి. పగ ప్రతికారాన్ని పక్కన పెట్టి పరిపాలన పై దృష్టి పెట్టు…సీనియర్ల సలహా తీసుకో అని అన్నారు.
నాలుగేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వేనుకేసుకోని వెళ్తా అనుకుంటానున్నావ్. విద్యార్థులు రోజు ఎక్కడో ఒక చోట ధర్నాలు చేస్తున్నారు. నెలకు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది
మహారాష్ట్ర లో వెళ్లి బోనస్ ఇస్తున్నాం అని చెబుతున్నారు. 2 లక్షల పైనా ఉన్న వారు మిగత కట్టాలని ఎందుకు నిబంధన పెట్టారు. 11 నెలల్లో ప్రజలు ఎం కోల్పోయారో, ఎం వచ్చిందో మాట్లాడుకుందామా? నేను చర్చకి సిద్ధం. రైతు బందు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, పోలీసుల కుటుంబాలు రోడ్ల పై వచ్చారు.. నేతన్న ఆత్మహత్య పెరిగాయని అన్నారు.
పాలమురు ప్రాజెక్టు ఆగిపోయింది. దళిత బంధు, బీసీ బంధు, కోల్పోయారు. ఉద్యోగులు రిటర్మెంట్ బోనస్ కోల్పోయారు. జర్నలిస్ట్ లు హక్కులు కోల్పోయారు. ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు.