ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఇది బడ్జెట్ నో… మ్యానిఫెస్టో నో ప్రజలకు క్లారిటీ లేదు

కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టినది బడ్జెటా లేక మ్యానిఫెస్టోనా అన్నది ప్రజలకు క్లారిటీ లేదని ఏపీసీసీ ఛీఫ్ ఫర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు.  ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పారు. బడ్జెట్ లో స్పష్టత లేదు.  బడ్జెట్ అంటే కేటాయింపులు.  ఇది కేటాయింపులు లేని బడ్జెట్.  ఇది మరో మ్యానిఫెస్టో.  సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది లక్షా 20 వేల కోట్లు కావాలి.  చంద్రబాబు ఈ బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు లేదని అన్నారు.  మహిళా శక్తి కింద ప్రతి నెల 15 వందలు ఇస్తా అన్నాడు.  కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు.  ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7500 కోట్లు ఇవ్వాలి.  కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదు.  తల్లికి వందనం కింద 15 వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అన్నాడు.  దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాలి.  రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు.  బడ్జెట్ లో నిధులు కేవలం 2 వేల కోట్లు.  అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా ?  ఉచిత బస్సు పథకానికి నిధులు ఒక్క రూపాయి ఇవ్వలేదు.  దాదాపు 2 వేల కోట్లు ఇవ్వాలి.  ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశ్యం లేదని అన్నారు.
 అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారు.  ప్రతి రైతుకి 20 వేలు ఏడాదికి ఇవ్వాలి.  ఈ లెక్కన 10400 కోట్లు ఇవ్వాలి.  కానీ బడ్జెట్ లో 4500 కోట్లు కేటాయించారు.  పక్కా ఇండ్లు 8 లక్షల ఇండ్లు కట్టిస్తా అన్నారు.  ఈ పథకానికి దాదాపు 32 వేల కోట్లు కావాలి.  కానీ ఇచ్చింది కేవలం 4 వేల కొట్లే . నిరుద్యోగ భృతి 18 వేల కోట్లు కావాలి.  3 వేలు ఇస్తామని చెప్పారు.  ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ బృతికి నిధులు లేవు.  గ్యాస్ సిలిండర్ల కింద కేటాయింపులు కేవలం 800 కోట్లె .  కావాల్సింది దాదాపు 4 వేల కోట్లు.  అంటే సగం మందికి సిలిండర్ల కింద కోత పెడతారా ?  చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి  కేటాయింపులు లేవు కానీ…ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది ఘనం. కరెంటు బిల్లుల రూపంలో 17 వేల కోట్లు వసూలు చేస్తున్నారు.  రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతారట. ఇది ప్రజల బడ్జెట్ కాదు.  ఇది మోసపూరిత బడ్జెటని వ్యాఖ్యానించారు.