2024 ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపి కంచుకోటగా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలడంతో జగన్ అక్కడ అయన్ని పక్కన పెట్టేశారు.సరిగ్గా అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయుల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన దేవరాయులు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా ఫిక్స్ అయ్యారు. దాంతో నరసరావుపేటలో దేవరాయుల్ని ఢీ కొనే సమర్ధుడైన నేత వైసీపీకి కరువయ్యారు. ఆ క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయిష్టంగానే నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు.
బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావుడి చేశారు.తనకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధేయపడ్డ అనిల్ కుమార్ యాదవ్.. ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కూడా కనిపించకపోవడం విశేషం.. వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్‌కుమార్ యాదవ్.. పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి.. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌లపై బూతులతో చెలరేగిన అనిల్.. ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలు పైన కూడా పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు.ఎన్నికల పోలింగ్ తర్వాత ఒకటి రెండు సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు . హైదరాబాద్‌లో తన వ్యాపారలావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారంట. కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఇన్చార్జ్ కరువయ్యారు.
నరసరావుపేట ఇన్చార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది? ఎప్పుడు నియమిస్తుంది? లావు కృష్ణదేవరాయుల్ని ఎదుర్కొనగలిగే సమర్ధుడు ఎవరున్నారు? ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే నడుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వైఎసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో ఇన్చార్జ్‌గా ఎవరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని దానిపైన నేతల్లోనూ క్లారిటీ లేదు.. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.. అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణగోపాలరెడ్డిని మళ్లీ ఇంఛార్జ్‌గా పంపుతారని ప్రచారం జరుగుతుంది.అసెంబ్లీ కంటే పార్లమెంట్ కు వెళ్లటానికే మోదుగుల మొదట నుండి మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడిగా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇంఛార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు . టీడీపీలో ఒక సారి నరసరావుపే ఎంపీగా, ఒక సారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల 2019 నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో కాని.. జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరీర్ త్రిశంకు స్వర్గానికి చేరిందిప్పుడు.