కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 90,125 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం.. నీటిమట్టం 884.10 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.91 టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 65,938 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.60 అడుగులున్నది. గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 310.8498 టీఎంసీలు నిల్వ ఉన్నది.