వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియూ అధికారులపై దాడి కుట్ర కేసులో, అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలిసిన కలిసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని అన్నారు. భూ కుంభకోణాలు ఫార్మా కంపెనీల పేరుతో చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని పోయినట్టు పోలీసులు పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఒక నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు చక్రవర్తివి కావు నీ పాపాలు త్వరలో పండుతాయి అని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి తో మాట్లాడుతే నా గురించి కాదు ఇందులో సంబంధంలేని 30 మందికి పైగా పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారికి అండగా ఉండాలని అన్నారు.
రేవంత్ రెడ్డి నువ్వు ఆడింది ఆట పాడిందే పాట అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటానని ఈ సందర్భంగా అన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన 30కి పైగా రైతులకు వారి కుటుంబాలకు కెసిఆర్ అండగా ఉంటాడని కేటీఆర్ అన్నారు….