తెలంగాణ రాజకీయం

జాతీయ స్థాయిలో బీసీ కుల గణనకై 5న మహాధర్నా

జాతీయస్థాయిలో బీసీ కుల గణన నిర్వహించడంతోపాటు బీసీల సమస్యల పరిష్కారానికై  డిసెంబర్ 5న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎందుకు సంబంధించిన పోస్టర్ను నాయకులు కుందారం గణేష్ చారి శ్రీనివాస్ విక్రం గౌడ్ వెంకన్న నరేష్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతాకాల పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాతో పాటు 6వ తేదీన అక్కడి కాన్స్టిట్యూషనల్ క్లబ్లో బీసీ సంఘాల నాయకులు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రధానంగా చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు జాతీయ జన గణంలోనే బిసి కులగనన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక కోట కల్పించాలి అనే ప్రధాన డిమాండ్లను పార్లమెంటు ముందు ఉంచినట్లు చెప్పారు.