ఆంధ్రప్రదేశ్

సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విజయవాడ సంచలకులు వారి ఆదేశాల మేరకు యు.పి.ఎస్.సి. నిర్వహించే సివిల్ సర్వీసెస్  ప్రాధమిక, తుది  పరీక్షల కొరకు  బి.సి. స్టడీ సర్కిల్,  గొల్లపూడి, విజయవాడ, ఎన్.టి.ఆర్. జిల్లాలో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు . ఏలూరు జిల్లాకు చెందిన అర్హత గల వెనుకబడిన తరగతులు (బి.సి), షెడ్యూల్ కులాలు (ఎస్.సి.) మరియు  షెడ్యూల్ తెగలకు  (ఎస్.టి) చెందిన అభ్యర్ధులు  తమ బయోడేటాతో పాటు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కు లిస్టులు, కుల ధృవీకరణ పత్రము, ఆధాయ ధృవీకరణ పత్రము, ఆధార్ జీరాక్స్ లు మరియు  2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ది. 24-11-2024  లోపు  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికార  కార్యాలయము,  కలక్టరేట్ కాంపౌండ్, ఏలూరు  నందు  ధరఖాస్తు చేసుకోవలన్నారు.  

దరఖాస్తుచేసుకున్న అభ్యర్ధులకు  ది. 27-11-2024 న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని, అందులో ఎంపికైన 100 ( బి.సి. 66%, ఎస్.సి 20%, ఎస్.టి. 14%) మందికి రిజర్వేషన్ ప్రాతిపదికన బి.సి. స్టడీ సర్కిల్,  గొల్లపూడి, విజయవాడ ,ఎన్.టి.ఆర్. జిల్లాలో ఉచిత శిక్షణ,  బస మరియు భోజన వసతి ఉంటుందన్నారు.  వివరములకు ఫోన్: 7569184335  ద్వారా సంప్రదించవచ్చాన్నారు.