తెలంగాణ

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక కళామండలి కళాకారులు పాటల రూపంలో ప్రజలకు వివరించారు. శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారథి పెద్దపల్లి జిల్లా కళాకారులచే ప్రగతి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కళాయాత్ర కమాన్ పూర్ మండలంలోని గుండారం, గొల్లపల్లి, నాగారం, గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు మరియు ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పైన విజయోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు చాలా ఉత్సాహంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు పాటల మాటల రూపంలో కళా ప్రదర్శనల ద్వారా ప్రచార వాహనములో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమాలు ఈనెల 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రతిరోజు రోజుకు మూడు గ్రామాల చొప్పున సాంస్కృతిక సారధి కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు రచయిత గాయకులు దయా నర్సింగ్ టీం లీడర్ ఈదునూరి పద్మ జనగామ రాజనర్సు కోండ్ర వెంకన్న గౌడ్
సాన గుండా రవీందర్ జిన్నారమ
దీకొండ శ్రావణ్ మంథని స్పందన
జెన్నీ శ్వేత ఉప్పు స్పందన
కళాకారుల బృందం పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.