అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ తల్లి విగ్రహం పైన వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేకత ఉందన్నారు. ఈ ఒక్క రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి ప్రత్యేకతను వివరించారు. విగ్రహావిష్కరణ లో కేసీఆర్ తో సహా అన్ని పక్షాల నేతలు పొల్గొనాలని రేవంత్ ఆహ్వానించారు. ఈ విగ్రహం భావన మాత్రమే కాదని .. నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం అని రేవంత్ పేర్కొన్నారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల్లో సీఎం రేవంత్ ముందుగా ప్రకటన చేసారు. సోనియా జన్మదినం ప్రస్తావించారు. డిసెంబర్ 9న నాడు చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన గురంచి గుర్తు చేసారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న రేవంత్.. విగ్రహ ప్రత్యేకతలను వివరించారు. మన సంస్కృతి సంప్రదా యలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి విగ్రమని చెప్పుకొచ్చారు. విగ్రహం కింద పీఠంలో నీలి రంగు గోదావరి, కృష్ణమ్మలకు గుర్తు అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కుడి చేతితో జాతికి అభయాన్ని ఇస్తూ.. ఎడమ చేతితో మొక్కజొన్న, వరి పంటలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి వరకు అధికారికంగా గుర్తింపు లేదని గుర్తు చేసారు. తెలంగాణ కు అధికారికంగా గేయం లేదన్నారు. చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని చెప్పిన రేవంత్.. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు.. అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలం గాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలను రేవంత్ గుర్తు చేసారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. తెలంగాణ ప్రతి రూపమే అధికారికంగా లేదన్నారు. అందరితో చర్చించి తెలంగాణ తల్లి రూపంపై నిర్ణయం తీసుకున్నామని రేవంత్ వెల్లడిచారు.
ఒక వ్యక్తి.. ఒక కుటుంబమే తెలంగాణ అనే భావన మంచిది కాదన్నారు. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత కారణంగా రాజకీయాలు పక్కన పెడదామని పిలుపునిచ్చారు. కాగా, ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం లో అభయహస్తం బిగించిన కొంగు చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా బిగించిన పిడికిళ్లు చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో మూడడగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది. ఈ సాయంత్రం సచివాలయంలో విగ్రహావిష్కరణ జరగనుంది.