హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సిమ్లా హైవే పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ కొండరాళ్ల మధ్య ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల.. హిమాచల్ ప్రదేశ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ్టి ఘటనలో ఎంత మంది మృతిచెందారో ఇంకా తెలియలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.