కేరళలో కరోనా మహమ్మారి ( Covid-19 ) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ప్రతిరోజూ దాదాపు 20 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 18,582 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా రికవరీలు అంతకంటే ఎక్కువే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,089 మంది కరోనా మహమ్మారి బారినుంచి బయటపడ్డారు.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 102 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 18,601కి పెరిగింది. ఇక ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులలో కరోనా రికవరీలు, మరణాలు పోను మరో 1,78,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అక్కడ కరోనా పాజిటివిటీ రేటు కూడా 15.11 శాతానికి పెరిగింది. అంటే పరీక్షలు చేయించుకున్న ప్రతి 100 మందిలో 15.11 మందికి పాజిటివ్ వస్తున్నదన్నమాట.