ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయినట్లు అక్కడి TOLO న్యూస్ వెల్లడించింది. ఆయన తన కోర్ టీమ్‌తో కలిసి ఆఫ్ఘనిస్థాన్‌ను వీడినట్లు తెలిపింది. ఘనీ తజకిస్థాన్ వెళ్లినట్లు అక్కడి అంతర్గత మంత్రిత్వ వర్గాలు తెలిపాయి.
తాలిబన్లు ఆదివారం రాజధాని కాబూల్‌ను కూడా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఘనీ ప్రభుత్వం తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలే మాత్రం తాను కాబూల్ వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అంతకుముందు కాబూల్‌లోకి దూసుకొచ్చిన తాలిబన్లకు వాళ్ల నాయకత్వం.. ఎలాంటి హింసకు పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అధ్యక్ష భవనానికి వెళ్లి చర్చలు జరిపారు. అధికారం శాంతియుతంగా బదిలీ చేస్తామని ఆఫ్ఘనిస్థాన్ మంత్రి కూడా వెల్లడించారు.