ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న లోకసభ స్పీకర్

లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాష్‌ బిర్లా ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద స్పీకర్ కుటుంబ సభ్యులకు ఎంపీలు విజయ సాయి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఓం బిర్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తిలో ప్రఖ్యాతి గాంచిన కలంకారీ కండువాతో స్పీకరు కుటుంబ సభ్యులను వేదపండితులు, ఆలయాధికారులు సత్కరించారు.