అంతర్జాతీయం జాతీయం

Startups Accelerator Programme : 16 ఇండియ‌న్ స్టార్ట‌ప్ కంపెనీల‌కు గూగుల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

గూగుల్.. ఈ పేరు తెలియ‌ని వాళ్లు ఉండ‌రు. ఐటీ ఇండ‌స్ట్రీలో గూగుల్‌ను మించిన కంపెనీ లేదు. గూగుల్ అంటే ఒక్క సెర్చ్ ఇంజిన్‌గానే మ‌న‌కు తెలుసు. కానీ.. మ‌న‌కు గూగుల్ గురించి తెలియ‌న‌ది చాలా ఉంది. గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ మాత్ర‌మే కాదు.. చాలా అప్లికేష‌న్ల‌ను గూగుల్ ర‌న్ చేస్తోంది. మ‌నం ఫోన్ల‌లో ఉప‌యోగించే ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కూడా గూగుల్ కంపెనీ డెవ‌ల‌ప్ చేసిందే.

అయితే.. గూగుల్ ఇటీవ‌ల‌.. Startups Accelerator programme ను ఇండియాలో ప్రారంభించింది. దీనిలో భాగంగా.. ఇండియాకు చెందిన కొన్ని స్టార్ట‌ప్ కంపెనీల‌ను సెలెక్ట్ చేసి.. వాటికి కావాల్సిన స‌పోర్ట్‌ను గూగుల్ అందించ‌నుంది. దీని కోసం గూగుల్‌కు 700 వ‌ర‌కు అప్లికేష‌న్లు వ‌చ్చాయి. వాటిని స్క్రీనింగ్ చేసి 16 కంపెనీల‌ను గూగుల్ సెలెక్ట్ చేసింది. సామాజిక‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చాలెంజింగ్ ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించే దిశ‌గా కృషి చేస్తున్న స్టార్ట‌ప్‌ల‌ను మాత్ర‌మే గూగుల్ సెలెక్ట్ చేసింది.

ఈ 16 స్టార్ట‌ప్ కంపెనీల‌కు గూగుల్ నుంచి మూడు నెల‌ల పాటు మెంట‌ర్‌షిప్ ల‌భించ‌డంతో పాటు.. గూగుల్ నెట్‌వ‌ర్క్‌కు చెందిన ఇండ‌స్ట్రీ మెంట‌ర్స్ నుంచి స‌పోర్ట్ ల‌భించ‌నుంది. గూగుల్ సెలెక్ట్ చేసిన 16 కంపెనీల‌లో హెల్త్‌కేర్‌, ఫిన్‌టెక్‌, సోష‌ల్, ఎడ్యుకేష‌న్‌, అగ్రిటెక్ రంగాల‌కు చెందిన కంపెనీలు ఉన్నాయి.

EkinCare

ఎకిన్ కేర్ అనేది వ‌ర్చువ‌ల్ కేర్ ప్లాట్‌ఫామ్‌. ఇన్సురెన్స్ కంపెనీల‌కు, కంపెనీల‌కు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్సురెన్స్‌కు సంబంధించిన అన్ని పాల‌సీల‌ను ఒకచోటుకు చేర్చి హెల్త్‌కేర్ కాస్ట్‌ను త‌గ్గించి.. యూజ‌ర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.

AgNext

ఏజీనెక్స్ట్ అనేది అగ్రిక‌ల్చ‌ర్ టెక్నాల‌జీకి సంబంధించిన కంపెనీ. అంటే.. టెక్నాల‌జీని ఉప‌యోగించుకొని వ్య‌వ‌సాయంలో ఎలాంటి ఆధునిక ప‌ద్ధ‌తులు ఉప‌యోగించి పంట‌లు పండించ‌వ‌చ్చు.. అలాగే.. ఆ పంట‌ల నాణ్య‌త‌ను అంచనా వేసి వాటికి ఎక్కువ గిట్టుబాటు ధ‌ర క‌ల్పించే దిశ‌గా కృషి చేస్తున్న కంపెనీ ఇది.

Goals101

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మిష‌న్ ల‌ర్నింగ్ టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించుకొని.. బ్యాంకులు త‌మ బిజినెస్‌ను ఎలా పెంచుకోవ‌చ్చు.. క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత ఈజీగా సేవ‌ల‌ను విస్త‌రించేందుకు కృషి చేస్తున్న కంపెనీ ఇది.

OkCredit

చిన్న చిన్న వ్యాపార‌స్తుల కోసం డిజిట‌ల్ బుక్ కీపింగ్ చేసుకునే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ ఇది. ఖాతా పెట్టి వ‌స్తువులు తీసుకెళ్లే కస్ట‌మ‌ర్ల వివ‌రాల‌ను డిజిట‌ల్‌లో నిక్షిప్తం చేసి.. ఈజీగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటును ఈ కంపెనీ తీసుకొస్తుంది.

Nemocare Wellness

ఈమ‌ధ్య పురిట్లోనే పుట్టి చ‌నిపోయే శిశువుల సంఖ్య‌, డెలివ‌రీ స‌మ‌యంలో మ‌ర‌ణించే గ‌ర్భిణీల సంఖ్య పెరుగుతోంది. దానికి కార‌ణం.. గ‌ర్భిణీగా ఉన్న‌ప్పుడు సరైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం.. ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా న‌వ‌జాత శిశువుల మ‌ర‌ణాల రేటు పెరుగుతోంది. న‌వ‌జాత శిశువు పుట్ట‌గానే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, డెలివ‌రీ త‌ర్వాత త‌ల్లి అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ కంపెనీ దృష్టి పెడుతోంది.

Zypp Electric

జిప్ ఎల‌క్ట్రిక్ అనేది.. ప్రాడ‌క్ట్స్ డెలివ‌రీ కోసం ఎల‌క్ట్రిక్ వెహికిల్‌ను ఉప‌యోగించే ప‌ద్ధ‌తి. ముఖ్య‌మైన వ‌స్తువులు, నిత్యావ‌స‌ర స‌రుకులు, మెడిసిన్స్ లాంటివి డోర్ డెలివరీ చేసే సంస్థ ఇది.

Bolo Live (Bolo Indya)

బోలో ఇండియా.. ఈ యాప్ ఇప్పుడు బోలో లైవ్‌గా మారింది. టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యాక‌.. రిలీజ్ అయిన షార్ట్ వీడియో యాప్ ఇది. అయితే.. ఈ యాప్‌లో లైవ్ వీడియో కూడా స్టార్ట్ చేయొచ్చు. లైవ్ వీడియో స్టార్ట్ చేసి.. వేరే యూజ‌ర్ల‌తో చాట్ చేయ‌డం, వాళ్ల‌ను ఆన్‌లైన్‌లోకి ఆహ్వానించి.. వాళ్ల‌తో స‌ర‌దాగా సంభాషించే ఫీచ‌ర్ ఈ యాప్‌లో ఉంటుంది.

Yoda

ఇది ల‌ర్నింగ్ యాప్. ఈ యాప్ ద్వారా టెక్నాల‌జీ, మార్కెటింగ్‌, సైన్స్‌, మ్యాథ్‌మెటిక్స్ స‌బ్జెక్ట్స్‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని నేర్చుకోవ‌చ్చు.

Hypd

ఈకామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్ల కోసం ఈ సంస్థ కంటెంట్‌ను అందిస్తుంది. వివిధ ర‌కాల ట్రెండ్స్‌ను ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది.

EloElo

ఇది ఒక సోష‌ల్ మీడియా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌

Aquaconnect

ఆక్వాక‌ల్చ‌ర్‌ను ప్రోత్స‌హించ‌డం కోసం.. చేప‌లు, రొయ్య‌ల సాగుపై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతో పాటు మార్కెట్ ప్లేస్‌కు సంబంధించిన ప‌రిష్కారాల‌ను అందించే కంపెనీయే ఆక్వాక‌నెక్ట్‌.

Bullet

ఇది క్రెడిట్ కార్డులా ప‌నిచేస్తుంది. యూపీఐ పేమెంట్ సిస్ట‌మ్‌తో ప‌నిచేసే ఈ సంస్థ‌.. 15 రోజుల బిల్లింగ్‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు క్రెడిట్ ఫెసిలిటీని అందిస్తుంది.

MedCords

ఆరోగ్యానికి సంబంధించి ఏ స‌మ‌స్య ఉన్నా.. ప్రైమ‌రీ డ‌యాగ్న‌సిస్ చేసి.. దానికి సంబంధించిన మెడిసిన్స్‌ను ఇంటికే డోర్ డెలివ‌రీ చేసే సంస్థ ఇది.

LegitQuest

మ‌న దేశ చ‌ట్టాలు ఒక్కోసారి అర్థం కావు. వాటిని చాలా సుల‌భంగా అంద‌రికీ అర్థం అయ్యేలా చెప్పేదే లెజిట్ క్వెస్ట్‌.

KareXpert

ఇది ఆసుప‌త్రుల కోసం ప‌నిచేసే డిజ‌ట‌ల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్‌. ప‌లు హెల్త్ కేర్ మాడ్యూల్స్ కోసం ఈ కంపెనీ వ‌ర్క్ చేస్తుంది. ఈ కంపెనీ మాడ్యూల్స్‌లో హెచ్ఐఎమ్ఎస్‌, ఈఎంఆర్‌, ఎల్ఐఎమ్ఎస్‌, ఆర్ఐఎస్‌, ఫార్మ‌సీ, టెలిమెడిసిన్‌, మెడిక‌ల్ ఐవోటీ, అడ్వాన్స్‌డ్ బీఐ, క‌నెక్టెడ్ అంబులెన్స్ లాంటి స‌ర్వీసుల మీద ఈ కంపెనీ వ‌ర్క్ చేస్తుంది.

Walrus

బ్యాంక్ అకౌంట్ లేకుండా.. బ్యాంకింగ్‌కు సంబంధించిన అనుభ‌వాన్ని పొందేలా.. కేవ‌లం టీనేజ‌ర్ల కోసం ఈ సిస్ట‌మ్‌ను తీసుకొచ్చింది వాల్‌ర‌స్‌.