ఆంధ్రప్రదేశ్

Mantralayam : మంత్రాలయంలో కొనసాగుతున్న శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు సోమవారం మూడో రోజు వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ప్రహ్లాదరాయలను బంగారు పల్లకి, చెక్క రజిత, నవరత్న స్వర్ణ రథంతోపాటు సింహ వాహనంపై ఊరేగించనున్నారు. ఆ తర్వాత స్వామివారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మఠంముఖద్వారం, ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.