ఆంధ్రప్రదేశ్

Srisailam project Update : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 25,360 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 178.3535 టీఎంసీల నీరుంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 38,478 క్యూసెక్కులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం నేరుగా దిగువ నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు చేరుతుంది.