ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 20,04,590కి పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 1,715 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,77,163కు చేరింది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇవాళ 15 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 13,750కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇంకా 13,677 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది.
AP Corona Update : ఏపీలో కొత్తగా 1,248 కరోనా కేసులు, 15 మరణాలు