ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వారు భేటీ అయ్యారు. గుంటూరులో దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్యను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. మంగళవారం ఈ బృందం గుంటూరులో పర్యటించి వివరాలు సేకరించింది. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్డర్, కమిషన్ సభ్యుడు డాక్టర్ అంజూ బాల, సుభాష్ రామ్‌నాథ్ పార్థి తదతరులున్నారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందించిన తీరు పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
National Sc commission : ఏపీ సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు