జాతీయం

ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాల్సిందే!

  • విద్యుత్‌ నియంత్రణ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
  • 2023 డిసెంబర్‌ డెడ్‌లైన్‌.. గడువు పొడిగింపు లేదు

పదిహేను శాతం కంటే ఎక్కువ విద్యుత్‌ వృథా జరిగే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2023 డిసెంబర్‌ నాటికి ఈ పని పూర్తిచేయాలన్నది. ఈ మేరకు డిస్కంలను ఆదేశించాల్సిందిగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థలకు సూచించింది. ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెగ్యులేటర్లు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ నేతృత్వంలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌, స్టేట్‌ లెవల్‌ రెగ్యులేటర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను అమర్చడానికి గడువు పొడిగింపును కోరిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లనే వాడాలన్నారు.