జాతీయం ముఖ్యాంశాలు

నానో డ్రోన్లకు పైలట్‌ లైసెన్స్‌ అక్కర్లేదు

డ్రోన్‌ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్‌ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్గించింది. ఫీజులు కూడా ఇప్పటివరకు ఉన్న 72 కాకుండా కేవలం నాలు గు రకాల ఫీజులను మాత్రమే వసూలు చేయనున్నట్టు పేర్కొన్నది. అంతే కా కుండా డ్రోన్ల అనుమతి ఫీజులను కూ డా బాగా తగ్గించారు. ఈ మేరకు కొత్త డ్రోన్‌ రూల్స్‌ గెజిట్‌ను గురువారం విడుదల చేసింది. మార్చి 12న జారీచేసిన అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌(యూఏఎస్‌) రూల్స్‌-2021కు సవరణలు చేసి ఈ రూల్స్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. తాజా నిబంధనల ప్రకా రం.. డ్రోన్ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌/ లైసెన్స్‌ జారీ చేయడానికంటే ముందు వాటిని వినియోగించాలంటే ప్రత్యేకంగా సెక్యూరిటీ క్లియరెన్స్‌ అవసరం లేదు. కార్గో డెలివరీల కోసం డ్రో న్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. డ్రోన్లు మోసుకెళ్లగల కార్గో బరువును కూడా 3 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు పెంచా రు. ఎయిర్‌ స్పేస్‌ను ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు జోన్లుగా విభజించారు. ఈ జోన్లు డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫారంలో కనిపిస్తాయి. గ్రీన్‌ జోన్‌లో డ్రోన్లు ఎగురవేయడానికి ఎలాంటి అనుమతి అక్కర్లేదు. డ్రోన్ల సైజుకు, అనుమతి ఫీజుకు సంబంధం లేదు. వాణిజ్యేతర, నానో డ్రోన్లకు పైలట్‌ లైసెన్స్‌ అక్కర్లేదు. విదేశీ కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న డ్రోన్లపై ఆంక్షలు ఉండవు. డ్రోన్‌ రూల్స్‌ను ఉల్లంఘిస్తే విధించే గరిష్ఠ జరిమానాను కూడా తగ్గించి రూ.లక్షకు పరిమితం చేశారు. కొత్త డ్రోన్‌ రూల్స్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.

ఎయిర్‌ ట్యాక్సీలు వస్తాయి
రోడ్లపై ఓలా, ఉబర్‌ క్యాబ్‌ల్లాగా కొత్త డ్రోన్‌ రూల్స్‌తో భవిష్యత్తులో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధి యా అన్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఎయిర్‌ ట్యాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, చా లా స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారు.