జాతీయం

కొత్త ఓటర్లకు ఈసీ లేఖ!

కొత్త ఓటర్లను చేరువకావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా నమోదైన ఓటర్లకు ఇకపై ఓటర్‌ ఐడీకార్డుతోపాటు ఈసీ నుంచి ఒక లేఖను కూడా పంపనున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభినందన లెటర్‌, ఓటర్‌ గైడ్‌, నైతిక ఓటింగ్‌పై ప్రతిజ్ఞ అందులో ఉండనున్నాయి.