జాతీయ క్రీడా దినోత్సవం( National Sports Day ) సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువతకు సందేశం ఇచ్చాడు. ఆటను ఓ అలవాటుగా మార్చుకోవాలని, అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ స్పోర్ట్స్ నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయని మాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 29న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తన ట్వీట్‌తోపాటు పిల్లలతో కలిసి తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా సచిన్ షేర్ చేశాడు. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఆటను ఓ అలవాటుగా మార్చుకోండి. మనతోపాటు చుట్టుపక్కల వాళ్లను ఆనందంగా ఉంచండి అని సచిన్ ట్వీట్ చేశాడు.