టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 621.7 స్కోరు సాధించిన అవని.. ఫైనల్లో అడుగుపెట్టింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు వరకు భారత్‌కు స్వర్ణం, రెండు రజత పతకాలు వచ్చాయి.
ఆదివారం టీటీ ప్లేయర్ భవీనాబెన్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన మొదటి ప్లేయర్‌గా భవీనా నిలిచారు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్‌లో ఉమెన్స్ షాట్‌పుట్‌లో దీపా మాలిక్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.