మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులచే మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకీ సేవ నిర్వహించారు.
Srisailam Temple | శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపార్చన