శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దుబాయి నుంచి ఇండిగో వీటీఐఎక్స్‌కే (VTIXK) విమానం హైదరాబాద్ వస్తున్న విమానంలో బాత్‌రూం డోర్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన అధికారులు అత్యవసరంగా కిందకు దింపారు. ఆ తర్వాత హుటాహుటిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని రప్పించి విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాత్‌రూంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం లభ్యమైంది. ఆ బంగారాన్ని సెక్యూరిటీ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దుబాయి నుంచి బంగారం తరలించిన ఇద్దరు మహిళల ప్రయాణికులను అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.
శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్!