ఆంధ్రప్రదేశ్

‘సీఎం జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు’

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఆదివారం భీమవరం గునుపూడిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు సన్మాన సభకు ఎంపీ భరత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ది జరుగుతుందన్నారు.

కరోనా కష్టకాలంలోను పేదలకు సీఎం జగన్‌ సంక్షేమాన్ని చేరువ చేశారని చెప్పారు. మన బడి, నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని, ఇంగ్లీష్ మీడియంతో పేద విద్యార్థుల భవితకు అండగా నిలిచారని కొనియాడారు. అనంతరం మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ.. కొయ్యే మోషన్ రాజు పార్టీకి అండగా ఉండి పని చేశారని తెలిపారు. కష్టపడిన వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు.