యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్యలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ ఆయన భార్య తమ పార్టీలో చేరారని ప్రకటించారు.
మాఫియా డాన్‌గా పేరొందిన అహ్మద్‌పై క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావిస్తూ బీజేపీలో పలువురు దిగ్గజ నేతలపైనా కేసులున్నాయని బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ తదితర నేతలను ఉద్దేశించి ఓవైసీ పేర్కొన్నారు. ముజ్‌ఫర్‌నగర్ అల్లర్ల కేసులో కాషాయ పార్టీ నేతలపై ఆరోపణలున్నా తర్వాత వారిపై కేసులు ఉపసంహరించారని గుర్తుచేశారు.