ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 61,363 కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా.. 1,361 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 1,288 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌తో 15 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,24,603కు పెరిగాయి. ఇప్పటి వరకు 19,96,143 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,950 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 282, చిత్తూరులో 203, పశ్చిమ గోదావరిలో 149, తూర్పు గోదావరిలో 143, గుంటూరులో 131, కడప జిల్లాల్లో 101 మంది వైరస్‌కు పాజిటివ్‌ పరీక్ష చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.