కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది. అయితే ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించింది. ఉదయం 6 నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు రెండు వేల చొప్పున టికెట్లు ఇస్తున్నారు. శ్రీనివాసం కౌంటర్లలో టికెట్లు జారీచేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాల వారికి కూడా టికెట్లు జారీ చేయనున్నారు.
కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. కేవలం రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతించారు. గతంలో నిత్యం 8 వేల సర్వదర్శనం టికెట్లను జారీచేసేవారు.