ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో కొత్తగా 1,439 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,439 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,311 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,97,454 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,964కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,71,61,870 శాంపిల్స్‌ను పరీక్షించారు.  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.