వినాయక చవితి వేడుకలను ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించి సీఎం కేసీఆర్, శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశుడిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి