ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Covid cases: ఏపీలో కొత్త‌గా 1608 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 1608 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 20,27,650కి పెరిగింది. అదేవిధంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1107 మంది క‌రోనా బాధితులు వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 19,98,561కి చేరింది. ఇక ఇవాళ మ‌రో ఆరుగురు క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా 13,970కి పెరిగింది. ప్ర‌స్తుతం ఏపీలో 15,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.