Time: 04:15 Pm
► మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మాది అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వమని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
► రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతామని, వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు.
►కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించామన్నారు. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
Time: 03:05 Pm
► హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలను చేశామని అన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎఫ్‌ఐఆర్‌లు చాలా వేగంగా నమోదు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని కొంత మంది అవహేళన చేస్తూ చట్టానికి సంబంధించిన కాపీలను తగల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Time: 02:30 Pm
► మహిళా సాధికారతపై ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు.
Time: 02:15 PM
► ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది.
Time: 01: 55 PM
► మహిళా సాధికారతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Time: 01:15 PM
► అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు.
Time: 12:57 PM
► మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు.
Time: 12:40 Pm
► వైఎస్‌ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు.
Time: 12: 30 PM
► రుణమాఫీ పథకం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్‌ఆర్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు.
Time: 12:24 PM
► ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు.
Time: 10:20 AM
► ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు.
Time: 10: 10 AM
► ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.
Time: 09:50 AM
► అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు హాజరు కాగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు.
Time: 09: 09 AM
► ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
► ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది.