తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమించడం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతను నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని తెలిపారు. సీఎం మార్గదర్శకత్వంలో ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తానని బాజిరెడ్డి చెప్పారు.
తనపై నమ్మకంతో భారీ బాధ్యతలను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.