తెలంగాణ ముఖ్యాంశాలు

TS Assembly | అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాల కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. గురువారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సమావేశంలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.