శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1090.90అడుగుల(89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.