జాతీయం ముఖ్యాంశాలు

Covid 19 | దేశంలో కొత్త‌గా 26,115 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 26,115 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 252 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రో 34,469 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 4,45,385కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది. ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 81.85 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.