గుంటూరు జిల్లా పరిధిలోని పెదనందిపాడు మండలం కొప్పర్రులో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గణేశ్ నిమజ్జనోత్సవ ప్రక్రియ సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. వైపీసీ కార్యకర్తలు టీడీపీ మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
శారద ఇంట్లోకి చొరబడ్డ కొందరు.. సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆ ఇంటి వద్ద ఉన్న ఆరు బైక్‌లను తగులబెట్టారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడులకు పాల్పడిన వారి వివరాలపై ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.