విశాఖ ఉక్కు (Vishakhapatnam steel plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం గాజువాకలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. అంతేకాకుండా ఏపీలో పెంచిన కరెంట్ చార్జీలతోపాటు కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
విశాఖ నగరంలో గల జింక్ గేట్ నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, సీపీఐ నేద బినోయ్ విశ్వం, జాతీయ కార్యాదర్శి కె.నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.