ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సీఎంపై ఉన్న కక్షను రాష్ట్రంపై చూపడమా!.. ఏపీ మంత్రి పేర్ని నాని

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ళ పోకడ చూస్తుంటే ఆంధ్రా తాలిబన్లలా ఉందని అన్నారు. సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు పోస్టులు పెట్టినా సీఎం జగన్‌ని ఏమి చేయలేరని తెలిపారు.

మద్రాస్‌కు సంబంధించిన ఓ వ్యక్తి చేసే వ్యాపారానికి విజయవాడ చిరునామా పెట్టుకున్నారన్నారు. ఆ వ్యక్తి మత్తుమందు తరలిస్తూ పట్టుబడితే.. దాన్ని పసుపు పచ్చ మీడియా విజయవాడతో లింకులున్నట్లు రాస్తున్నదని ఆందోళన చెందారు. బెజవాడలో భూకబ్జాలు చేసే వీళ్ళు గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్ గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా వాళ్లు బుద్ధి తెచ్చుకోవడం లేదని అన్నారు.